News

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

339views

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 7నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తితిదే రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.