News

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల రద్దు

275views

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో తిరుమలలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.తిరుమలో విపత్తు నిర్వహణ ప్రణాళికపై టిటిడి అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల రావు మాట్లాడుతూ, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు వీఐపీ విరామ దర్శనాలు రద్దు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సిఫార్సు లేఖలు అనుమతించకూడదని, అలాగే భక్తుల భద్రత దృష్ట్యా విరామ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.