News

జమ్మూ కాశ్మీర్లో క్రొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

579views

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్ సలహాదారు K విజయ్ కుమార్ రాంబన్ లో ఒక సహాయక నర్సింగ్ మరియు మిడ్విఫెరీ (ANM) పాఠశాలను మరియు జమ్మూలోని ఉధంపూర్ లో ఒక జనరల్ నర్సింగ్ మిడ్విఫెరీ (GNM) పాఠశాలను ప్రారంభించారు. కాగా, కశ్మీర్ లో ఆదివారం క్రీడల మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

రాంబన్ లో రూ. 2.69 కోట్ల వ్యయంతో నిర్మించిన  ANM స్కూల్ బిల్డింగ్ పూర్తి కాగా, ల్యాబ్ పరికరాలు, దృశ్య శ్రవణ పరికరాలు , పుస్తకాలు మరియు ఫర్నీచర్ ను కొనుగోలు చేసుకునేందుకు మరో రూ. 84.90 లక్షల మొత్తాన్ని అందించారు. మొత్తం 40 సీట్లకు, మూడు కోర్సులకు ఆమోదం లభించింది.

అత్యాధునిక వసతులు,  ఏడు ప్రయోగశాలలు, ఒక గ్రంథాలయం మరియు 40 మందికి వసతి కల్పించగల సామర్ధ్యం కలిగిన ఒక హాస్టల్ బ్లాక్ కలిగిన జిఎన్ ఎం పాఠశాలను ఉధంపూర్ జిల్లాలోని బెయిలీ వద్ద ప్రారంభించటం జరిగిందని, అలాగే కె కె హక్కు హాకీ స్టేడియానికి కూడా సలహాదారు ప్రారంభోత్సవం చేశారని  ప్రభుత్వ  ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

స్టేడియంలో సింథటిక్ హాకీ టర్ఫ్ కు కూడా గవర్నర్ సలహాదారు కే విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలోని పరేడ్ వద్ద ఉన్న మినీ స్టేడియంలో నూతన కాంతి వ్యవస్థ (ప్రకాశం) ను సలహాదారు ప్రారంభించారు. క్రీడా కార్యకలాపాల్లో యువత పాల్గొనడం వల్ల పురోగతికి మార్గం  సుగమమవుతుందని తెలిపారు.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం అనేక ప్రదేశాల్లో అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితి నిలకడగా ఉంది.