News

రతన్ టాటాకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నివాళులు

860views

వినమ్ర శ్రద్ధాంజలి

ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా మరణం భారతీయులందరికీ తీరని లోటు. ఆయన మరణంతో భారతదేశం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రతన్ టాటా అందించిన సహకారం చిరస్మరణీయం. నూతన మరియు సమర్థవంతమైన కార్యక్రమాలతో పాటు, పరిశ్రమలోని కీలక రంగాల్లో అనేక ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పారు. సమాజ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని రకాల పనులలో ఆయన నిరంతర సహకారం మరియు భాగస్వామ్యం కొనసాగింది. జాతీయ ఐక్యత మరియు భద్రత, అభివృద్ధి, తన వద్ద పని చేసే ఉద్యోగుల సంక్షేమం..ఇలా ఏదైనా కావచ్చు..రతన్ జీ తన ప్రత్యేకమైన ఆలోచన మరియు పనితో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అగ్ర శిఖరాలకు చేరుకున్నప్పటికీ ఆయన సరళత మరియు వినయం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. వారి పవిత్ర జ్ఞాపకాలకు మా వినమ్ర అభివాదాలు మరియు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ప.పూ. డా.మోహన్ భాగవత్ గారు, సర్‌సంఘ్‌చాలక్.

మాననీయ దత్తాత్రేయ హోసబాలే గారు, సర్‌కార్యవాహ,రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.