News

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

46views

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌ ఎం.జంపర్‌ను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగానూ బెకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు గానూ డెమిస్‌, జంపర్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నిన్న భౌతికశాస్త్రంలో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. ఈరోజు రసాయనశాస్త్రంలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువడింది. గురువారం సాహిత్యం విభాగానికి సంబంధించి ప్రకటన ఉంటుంది. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.