భారత్ నుండి పారిపోయి అనేక దేశాలు తిరిగి ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇస్లామిక్ మత బోధకుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాకీర్ నాయక్ స్త్రీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. . సాధారణంగా ఇస్లాం, ఖురానులపై ఉపన్యాసాలు, బహిరంగ ప్రసంగాలు చేసే జాకిర్ నాయక్, ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఖురాన్ ఆధారంగా వాటిని నివృత్తి చేస్తుంటాడు. అలాంటి ఓ బహిరంగ కార్యక్రమంలో స్త్రీలపై ఇతడు చేసిన వ్యాఖ్యల తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
ఇంతకీ జాకిర్ నాయక్ ఏమన్నాడో చూద్దాం.. ఇస్లామిక్ సమాజంలో పెళ్లికి దూరంగా ఉండే స్త్రీలకు ఎలాంటి విలువ ఉండదని, కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని అన్నాడు. స్త్రీలు తమకు తగిన పురుషుడు దొరకకపోతే కనీసం అప్పటికే పెళ్ళయిన పురుషుడినైనా వివాహం చేసుకోవాలని బోధించాడు. ఇంకాస్త దిగజారి, పెళ్లికాని స్త్రీలు పబ్లిక్ ప్రాపర్టీ అంటూ నీచంగా వర్ణించాడు. పైగా అలాంటి స్త్రీలను సూచించడానికి అంతకంటే తగిన పదం దొరకట్లేదని నీచంగా మాట్లాడాడు.
తమదేశంలో ఇస్లామిక్ ప్రసంగాలు ఇప్పించడానికి జాకిర్ నాయక్‌ని తీసుకురావడంపై పాకిస్తాన్ ప్రగతివాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా దేశం పరువు బజారుపాలైందంటూ లబోదిబోమని మొత్తుకుంటున్నారు. జాకిర్ నాయక్ చెప్పే ప్రతీదీ ఇస్లాంను అనుసరించి ఉంటుందని నమ్మేవాళ్ళ పరిస్థితి గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇతడిని గుడ్డిగా అనుకరించేవారు ఇప్పుడు ఇతడి వ్యాఖ్యలకు ఎలాంటి వివరణ ఇవ్వాలో తెలీక సతమతమవుతున్నారు. ఇతడి వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకంగా ఇస్లాంపై చర్చ మొదలైంది.
భారత ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వాటెండ్ లిస్ట్‌లో ఉన్న జాకిర్ నాయక్ విద్వేష ప్రసంగాలతో పేరు తెచ్చుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో 2016 నుంచీ పలు ఆరోపణలకు గురైన జాకిర్, భారత్ పరారీలో ఉంటూ మలేసియాను తన కేంద్రంగా చేసుకున్నారు. ఈడీ అధికారులు కూడా ఇతని కోసం వేటాడుతున్నారు. వివాదాస్పద ప్రసంగాల కారణంగా జాకిర్ సొంత ఛానెల్ ‘పీస్ టీవీ’పై భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అతనిని కెనడా, యూకే సైతం తమ దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతిని ఇవ్వలేదు.