News

జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం

380views

నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు. రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు.

ఈ సందర్భంగా జైలు సీనియర్‌ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్‌ చేశారన్నారు. ఈ నేపథ్యంలో రామబరాత్‌ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్‌ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.