News

వీరేశ్వరస్వామి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

8views

తూర్పు గోదావరి జిల్లాలోని ఐ.పోలవరం మురమళ్ల వీరేశ్మరస్వామి ఆలయానికి ఇండియన్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది. దీనితో పాటు ఐఎస్‌ఎల్‌ సంస్థ కూడా ఆలయాన్ని గుర్తించింది. ఈ మేరకు సహాయ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాసరాజులకు ఐఎస్‌వో సంస్థ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం ధ్రువకరణ పత్రాలు అందజేశారు. ఏదైనా ఒక సంస్థ నాణ్యత, భద్రత, సామర్థ్యం, పనితీరును నిర్థారించడానికి ఐఎస్‌ఓ ధ్రువీకరణ దోహదపడుతుంది.

మురమళ్ల వీరేశ్వరస్వామి వారికి విశేష చరిత్ర ఉంది. పచ్చని పొలాల మధ్య ఈ ఆధ్యాత్మిక కేంద్రం భాసిల్లుతోంది. నిత్య కల్యాణ శోభితుడైన భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఇక్కడ కొలువుదీరారు. యువత ఇక్కడ స్వామివారి కల్యాణం జరిపించుకొంటే వారికి వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. గత పదేళ్లుగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ వసతులు సైతం అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వీరేశ్వర అన్నదాన ట్రస్టు ద్వారా అందిస్తున్నారు. ఆలయంతో పాటు అన్నదాన నాణ్యత నిర్ధారిస్తూ ఐసీఎల్‌, ఐఎస్‌ఓ ధ్రువీకరణ ప్రతాలు వచ్చాయి.