ArticlesNews

వేధింపులపై గళం ఎత్తుతున్న బంగ్లాదేశ్ హిందువులు

35views

నవ జె ఠాకూరియా
గౌహతి కేంద్రంగా గల సీనియర్ జర్నలిస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, బాంగ్లాదేశ్ పరిణామాలపై నిపుణులు

బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులను మెజారిటీ ముస్లింలు తరచూ మతపరమైన వేధింపులకు గురిచేస్తుంటారని మనామా సాధారణంగా భావిస్తుంటాము. అయితే, ఇటీవల ఢాకా, చిట్టగాంగ్‌లలో నిర్వహించిన కొన్ని బహిరంగ ర్యాలీలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ దక్షిణాసియా దేశంలో గత జూలై నుండి రాజకీగందరగోళంలో కొట్టుమిట్టాడుతుండగా, దేశంలో కనీసం నాలుగు భారీ నిరసన ప్రదర్శనలు ఈ విధంగా జరిగాయి. తాజాగా సెప్టెంబర్ 13న జరిగింది.

ఇక్కడ మైనారిటీలు, వారి పవిత్ర స్థలాలపై కొనసాగుతున్న దాడులకు వ్యతిరేకంగా వేగవంతమైన, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ తో వేలాది మంది ఆందోళనకారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేసుకున్నారు. హిందూ జాగరణ్ మంచ్, నేషనల్ హిందూ ఫోరమ్, బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ మొదలైన హిందూ సంస్థల కూటమి సనాతని ఆదిఖార్ ఆందోళన్ ప్రతినిధులు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

హిందూ కుటుంబాలు, ఆస్తులపై జరిగే ప్రతి దాడులపై న్యాయమైన విచారణతో పాటు నేరస్తులను చట్టం కింద శిక్షించాలనే లక్ష్యంతో వారు ఎనిమిది అంశాల చార్టర్‌ను సమర్పించారు. అంతేకాకుండా, వారికి పరిహారం, పునరావాసం అందించాలని, మైనారిటీ కమిషన్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ అసెంబ్లీలో సీట్లు కొన్ని రిజర్వ్ చేయాలనే డిమాండ్లను లేవనెత్తారు.

తాము బంగ్లాదేశ్ చట్టబద్ధమైన పౌరులమని, తమను బయటి వ్యక్తులు లేదా భారత్ ఏజెంట్లుగా పేర్కొనరాదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తమ స్వస్థలమైనందున తాము ఎప్పటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. కాబట్టి అధికారులు తమకు భద్రత కల్పించాలని ప్రదర్శనకారులు తేల్చి చెప్పారు.

అంతకుముందు, సెప్టెంబరు 11న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో, తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ జూలై, ఆగస్టులలో జరిగిన హత్యలకు న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం తన ప్రభుత్వ ప్రాధమిక కర్తవ్యాన్ని పునరుద్ఘాటించారు. ఫాసిస్ట్ అవామీ లీగ్ ఛైర్‌పర్సన్ షేక్ హసీనా 15 ఏళ్ల నియంతృత్వ పాలనను అంతం చేయడానికి వందలాది మంది విద్యార్థులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల పౌరుల త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆమె ఆగస్టు 5 న పతనం అయ్యే వరకు క్రూరమైన మారణహోమానికి నాయకత్వం వహించింది. రబ్బరు బుల్లెట్లు పేల్చేటప్పుడు హసీనా బలగాలు తమ కళ్లను టార్గెట్ చేయడంతో గాయపడిన, జీవితాంతం వికలాంగులైన, చాలా మంది కంటిచూపు కోల్పోయిన వేలాది మంది గురించి మాట్లాడుతూ, దృఢమైన దృఢ సంకల్పంతో మృదువుగా మాట్లాడే పెద్దమనిషి వారికి ప్రభుత్వం వైద్య చికిత్సలు అందజేస్తుందని చెప్పారు.

అపూర్వమైన ప్రజా మద్దతుతో, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ యూనస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. ప్రధానంగా 90 రోజులలోపు విశ్వసనీయమైన జాతీయ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే 170 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికలను నిర్వహించడానికి ముందు వివిధ సంస్థలు, ఏజెన్సీలలో భారీ సంస్కరణకు వెళ్లాలని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని బలవంతం చేయవచ్చు.

ఇస్లామిక్ రిపబ్లిక్ నుండి లౌకిక బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత ఆమోదించిన రాజ్యాంగం- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి నిరోధక సంస్థ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, 1971లో మతవాద పాకిస్థాన్ నుండి విడిపోయి ఏర్పడిన లౌకిక బంగ్లాదేశ్ రాజ్యాంగంతో సహా వివిధ ప్రధాన విభాగాలలో సంస్కరణలను తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవల ఆరు కమీషన్లను ఏర్పాటు చేసింది.

సరైన సంస్కరణల తర్వాత, ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో తీసుకొచ్చిన తర్వాతనే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికలు సాధ్యమవుతాయని చాలామంది బంగ్లాదేశ్ జాతీయులు అంగీకరిస్తున్నారు. జూలై మధ్య నుండి బంగ్లాదేశ్‌ను చుట్టుముట్టిన అల్లకల్లోలంలో దాదాపు 850 మంది మరణించారు. 30,000 మందికి పైగా గాయపడ్డారు. కనీసం ఐదుగురు జర్నలిస్టులు కూడా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు.

జెనీవాకు చెందిన గ్లోబల్ మీడియా హక్కుల సంఘం ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ (పిఇసి) జర్నలిస్టులు హసన్ మెహెదీ, షకీల్ హొస్సేన్, అబూ తాహెర్ ఎండి తురాబ్, తాహిర్ జమాన్ ప్రియో, ప్రదీప్ కుమార్ భౌమిక్ హత్యలపై వేగవంతమైన విచారణను ప్రారంభించాలని మధ్యంతర ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.

భారతదేశం వంటి ముందుకు చూసే పొరుగు దేశంతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి ఢాకా ఎల్లప్పుడూ ఇష్టపడుతుందని ప్రొఫెసర్ యూనస్ వివిధ సందర్భాలలో పునరుద్ఘాటించారు. అయితే, సంబంధాన్ని న్యాయంగా, సమానత్వంతో నడిపించాలని మాత్రమే ఆశించాడు. అంతకుముందు ఆగస్టు 16న ప్రొఫెసర్ యూనస్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఫలవంతమైన చర్చలు జరిపారు.

బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ముస్లిం మెజారిటీ దేశంలోని మైనారిటీలు అందరికీ (జనాభాలో దాదాపు 10% మాత్రమే) భద్రత కల్పిస్తామని యూనస్ హామీ ఇచ్చారు. తన సౌలభ్యం మేరకు జర్నలిస్టుల బృందంతో పాటు బంగ్లాదేశ్‌ను సందర్శించాల్సిందిగా భారత ప్రధానిని కూడా ఆయన ఆహ్వానించారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు కొన్ని మంచి రోజులు ఆశించవచ్చా!