News

హిందువుగా నటించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం

48views

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో మరో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. హిందూ మైనర్ బాలికతో ఒక ముస్లింవ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకున్నాడు. జులై 30న కిడ్నాప్ చేసాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి, నిందితుణ్ణి తక్షణం బంధించాలని డిమాండ్ చేసాయి.

ఆగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్‌లో జులై 30న ఒక వ్యక్తి తన 14ఏళ్ళ కూతురి గురించి ఫిర్యాదు చేసాడు. దాని ప్రకారం… 8వ తరగతి చదువుతున్న అతని కుమార్తె ఆ రోజు ఉదయం యధావిధిగా బడికి బయల్దేరి వెళ్ళింది. దారిలో ఆమెకు రాజు ఎదురయ్యాడు. ఆమెకు రాజుగా తెలిసిన ఆ వ్యక్తి అసలుపేరు ముస్తాక్. ఫరూఖాబాద్ నివాసి. అతను కొంతకాలంగా ఆ బాలిక వెంటపడుతూ ఆకర్షించాడు. చివరికి ఆరోజు ఆమెను తనతో తీసుకుపోయాడు. ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 137(2), 87 ప్రకారం ముస్తాక్‌పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. నిందితుడు ముస్తాక్ ఆగ్రాలో ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. బాధిత బాలికను ప్రేమ పేరుతో ఆకట్టుకున్నాడు. అతని మాయలో పడిన ఆ అమ్మాయి, ఇంట్లోనుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయింది. ముస్తాక్ అలియాస్ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాలిక అతనిదగ్గర ఉందో లేదో తెలియదు. పోలీసులు ప్రస్తుతం అతని కోసం, బాధిత బాలిక కోసం గాలిస్తున్నారు.