
583views
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంనకు గురువారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో న్యాస్థానం ఏకీభవించడంతో చిదంబరానికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.





