News

అంతరిక్షంలో అద్భుత నిధి: బంగారం,ప్లాటినం నిక్షేపాలు

51views

అంతరిక్షంలో అద్భుత నిధిని నాసా కనిపెట్టింది. విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు తెలిపింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్‌ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్‌, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ గ్రహ శకలంలో 100000 డాలర్ల క్వాడ్రిలియన్‌ విలువైన లోహాలు ఉన్నట్టు నాసా తెలిపింది.

2029 నాటికి ఆస్టరాయిడ్‌లను చేరుకునేందుకు నాసా సైకి మిషన్‌ను 2023 అక్టోబర్‌ 13న ప్రారంభించింది. పరిశోధనలో భాగంగా గ్రహశకలం 16 సైకిపై బంగారం, ప్లాటినం, నిఖిల్‌ వంటి ఖరీదైన లోహాలు ఉన్నట్టు నాసా నిర్ధారించింది.

ప్రస్తుతం అంతరిక్ష మైనింగ్‌ సాంకేతికత ఆరంభ దశలోనే ఉంది. తక్కువ గురుత్వాకర్షణ, అధిక రేడియేషన్‌ ఉండే ఈ లఘుగ్రహంలో మైనింగ్ కు ప్రత్యేక పరికరాలు అవసరం. భూమికి, గ్రహశకలం మధ్య కమ్యూనికేషన్‌లో ఏర్పడే ఆలస్యం కారణంగా అవి స్వతంత్రంగా పనిచేయాల్సి ఉందని సెంట్రల్‌ ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రహ భౌతిక శాస్త్రవేత్త ఫిలిప్‌ మెట్జ్‌గర్‌ వివరించారు.

గ్రహాలపై ఖనిజాల తవ్వకం అత్యంత ఖరీదైన వ్యవహారం. తవ్వకాలకు నిధులు సమకూర్చడానికి ప్రైవేట్‌ కంపెనీలు ముందుకొస్తున్నప్పటకీ పలు ముఖ్యమైన వనరులు అవసరం. అక్కడి నుంచి తెచ్చే లోహాలు ప్రపంచ మార్కెట్‌లోకి వస్తే పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తీవ్ర కుదుపులు సంభవిస్తాయి. పౌరుల ఆస్తుల విలువ తగ్గే అవకాశముంది.