News

కావడి యాత్రికులపై ముస్లిముల విద్వేష దాడులు

96views

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు పారబోయడం, రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హరిద్వార్ నుంచి కావిళ్ళతో గంగాజలం తీసుకొస్తున్న యాత్రికులు హాపుర్‌లోని బులంద్‌షహర్ రోడ్ మీదుగా వెడుతుండగా ఆ దారిలో ఉన్న మదరసాలోని కొందరు ముస్లిములు ఈ దాడులకు తెగబడ్డారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… కొందరు ముస్లిములు మదరసా బైట నిలబడి ఉన్నారు. ఆ దారిలో కావడి యాత్రికులు రాగానే వారిపైన, వారి చేతుల్లోని కావిళ్ళ పైన ఉమ్మి ఊసారు. ఆ తర్వాత మురికి నీళ్ళు యాత్రికుల మీద పోసారు. రాళ్ళు రువ్వారు. తమ దాడి ముగియగానే మదరసా లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నారు.

ముస్లిముల దాడి గురించి తెలియగానే ఇతర కావడి యాత్రికులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు తమ కావళ్ళను పక్కన పెట్టి మదరసా బైట ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన హిందూసంస్థల ప్రతినిధులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.

పోలీసు రికార్డుల ప్రకారం వారు ఇద్దరు నిందితులను అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడం కోసం, అక్కడి ప్రజలు తీసిన వీడియో ఫుటేజ్‌ను, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ముస్లిముల దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాన్ని చూసిన సామాన్య ప్రజలు తమ పవిత్ర యాత్రపై జరిగిన దాడిని తట్టుకోలేకపోతున్నారు. కావడి యాత్రికుల మీద అంత విద్వేషం ఎందుకో అర్ధం అవడం లేదు. ఇలాంటి మతపరమైన విభజన విద్వేషాలను రగల్చే పనులను నిలిపివేయాలని కోరుతున్నారు. పరమత సహనంతో తోటివారిని గౌరవించడం అన్నిమతాలవారికీ అలవాటు అవాలి. కానీ ఒకమతస్తులు హిందువులపై ఏకపక్షంగా దాడులు చేయడం వారిని రెచ్చగొడుతోంది.

ఆగస్టు 1న జరిగిన ఆ సంఘటనతో పోలీసులు, అధికారుల మీద ఒత్తిడి పెరుగుతోంది. సంఘటనను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, అటువంటి దాడులు మళ్ళీ జరక్కుండా చూడాలనీ హిందువులు కోరుతున్నారు.