News

అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్లను విడుదల చేసిన టీటీడీ

46views

తిరుమల, తిరుపతి దేవస్థానం అక్టోబర్‌ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్ల ను మంగళవారం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంట‌ల‌కు విడుద‌ల చేస్తుంది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అక్టోబరు నెల‌కు సంబంధించిన కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు ప్రకటించారు. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.