65
డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయోధ్య రామమందిరంలో శ్రీరాముడికి సమర్పించేందుకు దాతల వితరణతో తయారు చేయించిన 15 కేజీల వెండి ధనస్సు, ఒక కిలో బరువుగల బాణానికి రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గా పీఠంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) పూజలు చేశారు. భక్తుల సౌజన్యంతో సిద్ధం చేసిన వెండి ధనస్సు, బాణానికి ప్రత్యేక రథంలో దేశంలోని బద్రీనాథ్ తదితర ప్రముఖ దేవాలయాల్లో, శ్రీలంకలోనూ పూజలు నిర్వహించి.. అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది సీతారామ కల్యాణ సమయానికి రాముడికి సమర్పించనున్నామన్నారు.