News

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర

95views

దక్షిణ మధ్య రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుండి వచ్చిన భారీ స్పందనను స్పూర్తిగా తీసుకొని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సికింద్రాబాద్ నుండి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది.

తొమ్మిది రోజుల పాటు జరిగే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పర్యటన రైలు ఈ నెల 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించి దక్షిణ భారతదేశంలోని తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, -మధురై-, కన్యాకుమారి, -త్రివేండ్రం-, తిరుచ్చి-, తంజావూరు వంటి దివ్య,తీర్థ స్థలాలను సందర్శింపచేస్తుంది.

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణీకులందరికీ జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనానికై ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ , అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ప్రయాణీకులు మార్గ మధ్యంలో ఎక్కే/దిగే సౌకర్యాన్ని కల్పించిందని ఐఆర్‌సిటిసి వివరించింది.

ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు/9 రోజుల పాటు సాగుతుంది.