News

ఇష్టకామేశ్వరి అమ్మవారు చెంతకు సరైన మార్గం

76views

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల గ్రామంలోని వారందరూ చెంచు గిరిజనులే.ఈ గ్రామంలోని ఇష్టకామేశ్వరీ దేవాలయం ఆధ్యాత్మికంగా విశిష్ట గుర్తింపు పొందింది.

భక్తుల కొంగు బంగారం అమ్మవారు
ఆధ్యాత్మికంగా ఇష్టకామేశ్వరి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చె కొంగుబంగారంలా భావించి, జీవితంలో ఒక సారైనా దర్శించుకోవాలని, తమ కష్టాలు, బాధలు తొలగించు కోవాలని భక్తులు భావిస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వస్తారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీపులలో మాత్ర మే ఒక్కొక్కరికీ, రూ.1,000లు చెల్లించి ప్రయాణించాల్సి ఉంది. అది కూడా ముందు రోజే శిఖరం వద్ద తెల్లవారు జామునే టిక్కెట్లు ఇస్తారు. అయినా రోజుకూ 150 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

గుర్తింపు పొందిన ప్రాంతం అయినప్పటికీ, గ్రామానికి సరైన మార్గం కూడా లేక పోవడంతో ప్రజల సమస్యలు వర్ణణాతీతంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రగొండపాలెం మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం కీకారణ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఈ గ్రామం ఏర్పడింది. ఆ గ్రామంలో నివసించే గిరిజనులు అమ్మవారి చెంతనున్న వీరి సమస్యలు వర్ణణాతీతం.ఇప్పటికైనా తగిన మౌలిక సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానిక చెంచు గిరిజనులు కోరుతున్నారు.