News

అమెరికాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

117views

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామి వారి గోవింద నామం మార్మోగింది. నిత్యం ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ, తిరు ఆరాధన గజవాహన సేవ వంటి క్రతువులను నిర్వహించారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఇవాళ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.