News

పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం

102views

ఆగ్రా అంటే తాజ్ మహల్ మాత్రమే గుర్తుకు వచ్చేలా చేశారు. అది గొప్ప కట్టడమే. భారతీయ శ్రామికుల కష్టమే. కానీ ఇప్పుడు ఆగ్రాకు సమీపంలో, తాజ్మహలు 12 కిలోమీటర్ల దూరంలో మరొక అద్భుతమైన పాలరాతి కట్టడం తయారైంది. ఇది రాధాస్వామి ఆరాధనా విధాన మూల పురుషుడు పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం. తాజ్ మహల్ కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతుంది. రాధాస్వామి స్మారక మందిరం కట్టడానికి వందేళ్లు పట్టింది.

తాజ్ వలెనే ఇది కూడా పూర్తిగా రాజస్తాన్ నుంచి తెచ్చిన తెల్ల పాలరాతితోనే నిర్మించారు. ఆగ్రాలోనే దయాల్బాగ్ అనే చోట స్వామి బాగ్లో ఇది కట్టారు. ఇక్కడ ప్రవేశం ఉచితం, కానీ ఫోటోలు తీయడం నిషిద్ధం. ఇదే స్థలంలో మొదట తెల్ల పాలరాతితోనే పూర్ణథాని మహరాజ్ స్మారక చిహ్నం చిన్నదిగా నిర్మించారు. ఆయనకు లక్షలాది మంది భక్తులు ఉన్నారు. అలహాబాద్కు చెందిన ఒక వాస్తు శిల్పి 1904లో ఈ నిర్మాణానికి పథక రచన చేశారు. మొదట కొంత నత్తనడక నడిచినా 1922 నుంచి నిర్మాణంవేగంగానే జరిగింది. అంటే కొందరు శిల్పులు, కళాకారుల జీవితం దీని నిర్మాణంలోనే గడిచి పోయింది. మొదట అంతా హస్తకళా నైపుణ్యంతోనే పనులు జరిపినప్పటికీ తరువాత యంత్రాల సాయం కూడా తీసుకున్నారు.