News

ఆ అమెరికా బడి ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తోంది

352views

ఫ్లోరిడాలో రివైవర్ అకాడమీ నడుపుతున్న ముస్లిం పాఠశాల ‘భావి ఉగ్రవాదుల’కు తర్ఫీదు ఇస్తోందని అక్కడి ప్రజాప్రతినిధి రాండీ ఫైన్ ఫిర్యాదు చేశారు. ఫ్లోరిడా విద్యాశాఖ కమిషనర్ మ్యానీ దియాజ్కు ఈ మేరకు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు అందచేశారు. రివైవర్ అకాడమీని వెంటనే రద్దుచేయాలని కూడా ఆయన కోరారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఫైన్ ఆరోగ్య, మానవసేవల కమిటీ అధ్యక్షుడు కూడా. ఆ పాఠశాల కార్యకలాపాల మీద దర్యాప్తు చేయించి, పన్ను చెల్లింపుదారుల విలువైన ధనాన్ని అందకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఫైన్ కోరారు. ఫైన్ యూదు మతస్థుడు. ఫ్లోరిడా రాష్ట్ర చట్టసభలో ఆయన ఒక్కడే యూదు సభ్యుడు. రివైవర్ అకాడమీని మస్జీద్ అస్ సున్నా నబావియ్యా నడిపిస్తున్నది. ఈ మసీదు ఉత్తర మియామీలో ఉంది.

ఈ మసీదుకు డాక్టర్ ఫాది కబ్లవి (పళ్ల డాక్టర్) మౌల్వీగా పనిచేస్తున్నారు. ఇతడు ఇటీవల ఒక మసీదులో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడని ఫైన్ ఆరోపణ. విద్యాశాఖకి ఫైన్ అందించిన ఫిర్యాదులో అంశాలు ఇలా ఉన్నాయి: ‘ఇమామ్ కబ్లవీ ఉపయోగిస్తున్న జనహనన భాష ఒక విషయం స్పష్టం చేస్తుంది. అల్లా కోసం యూదులను చంపడం మీ (ముస్లింల) బాధ్యత. అంటే మనం అక్షరాలా భావి ఉగ్రవాదులను తయారు చేయడానికి నిధులు ఇస్తున్నాం. అది కూడా ఇరాన్లో కాదు, ఇక్కడే. ఇది వెంటనే ఆగిపోవాలి. అందుకే తక్షణం రివైవర్ అకాడమీని రద్దు చేయాలని కోరుతున్నాను’ అని ఫైన్ పేర్కొన్నారు. డాక్టర్ కబ్లీవి డెంటిస్ట్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలని కోరుతుంది లేకపోతే కొందరికి ప్రమాదమని హెచ్చరించింది