భారతీయ సంస్కృతిలో జీవన విలువలున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్ వారణాసి రామ్మాధవ్ అన్నారు.కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో న్యూ ఢిల్లీకి చెందిన కొచ్చర్లకోట రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత వాగ్గేయ కారుడు కొచ్చర్లకోట రామరాజు 148వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంగీత వాగ్గేయ కారుడు రామరాజు తన కళను ధన సంపాదన కోసం కాకుండా కీర్తి సంపాదించేందుకు ఉపయోగించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి ధార్మిక భావంతో ఉన్నప్పుడే కళలు విశ్వవ్యాప్త మవుతాయన్నారు. క్రీ.స్తుశకం 6వ శతాబ్దం వరకు ఎటువంటి కుల వివాదాలు లేవని, విదేశీయుల దండయాత్రలతో కులో న్మాధం ప్రజ్వరిల్లిందని ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరిస్తున్నాయన్నారు.సంగీతం మనుకు ప్రశాంతత ఇస్తుం దన్నారు. ఉగ్రరూపంలో ఉండే దేవతలు సైతం సంగీత కళ వాయిద్యాల ద్వారా ప్రశాంత రూపంలో భక్తులను దర్శనం ఇస్తున్నారన్నారు.
265views
You Might Also Like
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు స్థిరమైన ఆదాయం..
5
ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు....
మాహ్రంగ్ బలోచ్ ఖైదుపై తీవ్రంగా స్పందించిన బలోచ్ సంస్థలు
8
పాకిస్తాన్ లోని ఒక తీవ్రవాద నిరోధక కోర్టు (ATC) ప్రముఖ బలోచ్ సామాజిక కార్యకర్త డాక్టర్ మాహ్రంగ్ బలోచ్ సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ...
బస్తర్ మారుమూల ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం… బుద్రి తాటి విజయ ప్రస్థానం
పేదరికం, ఏకాంతం, నక్సల్స్ హింస వంటివి చాలా సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా వుండిపోయింది బస్తర్. దట్టమైన అడవుల్లో చాలా మంది పేదలు వుండిపోతున్నారు. విద్య, వైద్యం కూడా...
దేవతలు, ‘భారత్ మాత’ లేదా రాజకీయ అమరవీరుల పేర్లతో ప్రమాణం చేయరాదు : కేరళ హైకోర్టు
28
తిరువనంతపురం: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టంలో నిర్దేశించిన ప్రమాణ స్వీకార పదజాలాన్ని యథాతథంగా అనుసరించాలని, దేవతలు, 'భారత్ మాత', సంస్థలు, రాజకీయ అమరవీరులు లేదా ఇతర...
ప్రకృతి రక్షణలో భారతీయ మహిళ
భారతీయ మహిళలు మన ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే, ఆధునిక సాంకేతికతతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆశయాలను నిజం చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం మొదట వీరిపైనే పడుతున్నా,...
NCERT పాఠ్యపుస్తకాల్లో మరాఠా సామ్రాజ్య చరిత్రను పునరుద్ధరించాలి : కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
37
ముంబై: 8వ తరగతి NCERT సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం నుంచి తొలగించబడిన మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన మ్యాప్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక అంశాలను తిరిగి చేర్చాలని...





