ArticlesNews

దేశీ గోమూత్రం పై పేటెంట్ భారత్ దే, బాగా కృషి చేసిన “గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”

149views

మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్‌ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్‌ పొందారు. దీనిని గమనించిన నాగపూర్‌ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న దేవలాపూర్‌ గ్రామంలో స్థాపించిన ‘గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం’’ వారు మన దేశంలోని నాటు ఆవు జాతులను సంరక్షిస్తూ ఆవు మూత్రంపై 7 పేటెంట్లు సాధించారు.

ఇవీ పేటెంట్ల వివరాలు..
1. అమెరికా నుంచి గోమూత్రం రోగ నిరోధకంగా
2. కేన్సర్‌ నిరోధకంగా
3. ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా నాశనకారిగా
4. మొక్కల పెరుగుదలతో పాటు మొక్కలకు వచ్చే తెగుళ్ల నిరోధకంగా
5. మొక్కలలో ఏర్పడే వినాశకర క్రిమి నాశనకారిగా
6. మనుషులకు వంశపారంపర్యంగా కలిగే జన్యు లోపాలను సరిచేసే మందుగా పనికొస్తుందని నిరూపించే పరిశోధనల ప్రమాణాలతో పేటెంట్లు
7. అలాగే చైనా నుంచి మనుషులకు వంశపారంపర్యంగా కలిగే జన్యు లోపాలను సరిచేసే మందుగా పేటెంట్‌.

అంటే మన దేశంలోని దేశీ ఆవుల మూత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతూ హక్కులు కూడా పొందేలా కృషి చేశారు. గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం ను స్థాపించిన వారికి, నిర్వహిస్తున్న వారికి ఈ కేంద్రం నిర్వహించే పరిశోధనల్లో పాలుపంచుకున్న వారికి భారతీయులందరూ రుణపడి వున్నారు.