News

పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లు తేనున్న కేంద్రం

22views
పేపర్ లీక్ లపై కేంద్రం మరింత అప్రమత్తమైంది. పేపర్ లీకేజీలు కాకుండా వుండేందుకు కఠినమైన చట్టాలు తీసుకొస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రకటించారు. పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లుపై శుక్రవారం జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా అతి త్వరలోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆ బిల్లును ఆమోదిస్తామని కూడా కీలక ప్రకటన చేశారు.
‘‘స్నేహితులారా.. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కానే కాదు. ఇది నాకు బాగా తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపాం. మా అత్యంత ప్రాధాన్యతా అంశం విద్యార్థుల అకాడమిక్ ఇయర్. దీనిని నష్టపోకుండా చూస్తున్నాం. అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించాం.అంతటితో ఆగిపోలేదు. రెండున్నర నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం. పేపర్ లీక్ లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. అందుకే మరిన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించాను. త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు పెడతాం’’ అంటూ ప్రధాని మోదీ ఆ వీడియోలో ప్రకటించారు.
వేగంగా స్పందిస్తున్న మోదీ ప్రభుత్వం…
విద్యార్థుల ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రం వేగ వేగంగా స్పందిస్తోంది. సోనం వాంగ్ చుక్ 26 రోజుల నిరాహార దీక్షను కేంద్ర మంత్రులు విరమింపజేశారు. గురువారం ఉదయం, రాత్రి.. రెండు సార్లు ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. లీకులపై కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. పీఎం ఉదయం ప్రకటన తర్వాత సాయంత్రం కల్లా ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలు చేసింది. పరీక్ష పత్రాల లీక్ లపై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఆ తర్వాత ఉన్నత విద్య శాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్ ను నియమించింది. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ వెళ్లి, వాంగ్ చుక్ తో చర్చలు జరిపారు. దీక్షను విరమింపజేశారు.