News

అన్నల్లా ఆదుకున్నారు. అందుకే ఈ రాఖీ.

181views

త కొన్ని రోజులుగా మహరాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలను అక్కడికి పంపి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వారు బాధితులను పునరావాస శిబిరాలకు తరలించి కావాల్సిన ఆహారపదార్థాలను అందించారు. రెండు మూడు రోజులకు ముందు ఇద్దరు ఎన్డీఆరెఫ్ సిబ్బంది వరదలో చిక్కుకున్న కొందరు మహిళలను రక్షించి బోటులో సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా ఒక యువతి తనకు అటూ ఇటూ నిలుచున్న సైనికుల పాదాలకు నమస్కరిస్తున్న దృశ్యాలున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అందరి హృదయాలనూ కదిలించింది. చూసిన వారందరూ సైనికుల సేవలను కొనియాడారు.

సోమవారం పరిస్థితులు కుదుటపడ్డాక సాంగ్లీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి మహిళలు రాఖీలు కడుతున్న దృశ్యాలే కనిపించాయి. “ఆపదలో చిక్కుకున్న మమ్మల్ని అన్నల్లా ఆదుకున్నారు. అందుకే రక్షాబంధన్‌కు రెండురోజుల ముందుగానే మీకు రాఖీ కడుతున్నాం”. ఇవి మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని మహిళలు, బాలికలు ఎన్డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు నివారణ సంస్థ) సిబ్బందితో అంటున్న మాటలు.   ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలకు,వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.