News

జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థుల అభినందన సభ.

68views

ర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థులకు బహుమతి ప్రదానంతోపాటు, అభినందన సభ కూడా జరిగింది. ఈ సభలో ముఖ్య వక్త డా. ఉదయ శంకర్, సంఘమిత్ర అధ్యక్షులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణ నైపుణ్యం, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు పెంపొందించే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలిపారు. గెలుపు ఓటములను క్రీఢా స్పూర్తితో స్వీకరించి రాబోవు ప్రదర్శనలో మన బలహీనతలను అధిగమించి సర్వ శ్రేష్ట ప్రదర్శన దిశగా కృషి చేయాలని తెలిపి విద్యార్థులలో స్పూర్తిని నింపారు.

ఈ అభినందన సభలో సంఘమిత్ర ఉపాధ్యక్షలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ అశోక్, శ్రీ రమణయ్య గౌడ్, కోశాధికారి సముద్రాల నాగరాజు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.