News

తిరుమలలో రేపు ఉగాది ఆస్థానం

172views

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉగాది పర్వదినం సందర్బంగా ఏప్రిల్ 9న ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవ నిర్వహించిన అనంతరం శుద్ధి చేస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనుల స్వామికి విశేష సమర్పణ చేస్తారు.

ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహిస్తారు. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఉగాది ఆస్థానాన్ని ఆగమ పండితులు, అర్చకులు నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకుని ఏప్రిల్ 9న ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను టీటీడీ రద్దు చేసింది.