News

ఘనంగా శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం

232views

అనకాపల్లి జిల్లాలోని గవరపాలెంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పుశ్రీ నూకాంబిక అమ్మ వారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమయింది. జాతరలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి తెల్లవారుజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం రథంపై ఉంచి పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపును ఆలయ ఈవో బండారు ప్రసాద్‌ ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేశారు. అమ్మవారి మాలధారణ భక్తులు ఘటాలను తలపై ఉంచి, కొందరు శూలధారులై ఊరేగింపులో పాల్గొన్నారు. మాలధారణ సంఘం వ్యవస్థాపకుడు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం వద్ద మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిపారు. నేలవేషాలు, కోలాటం తదితర సాంస్కృతిక ప్రదర్శనలతో అమ్మవారి ఊరేగింపు శోభాయమానంగా జరిగింది.