News

ఎన్నికల షెడ్యూల్ ఇదే, మే 13న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..

295views

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇది..

లోక్‌సభ ఎన్నికల తేదీలు, ఏ రోజు ఎన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి అన్న వివరాలు ఇలా ఉన్నాయి….

లోక్‌సభలో మొత్తం 543 నియోజకవర్గాలు ఉన్నాయి.

మొదటి దశ (102) : 19 ఏప్రిల్ : 21 రాష్ట్రాలు

రెండవ దశ (89) : 26 ఏప్రిల్ : 13 రాష్ట్రాలు

మూడవ దశ (94) : 7 మే : 12 రాష్ట్రాలు

నాలుగవ దశ (96): 13 మే : 10 రాష్ట్రాలు

ఐదవ దశ (49) : 20 మే : 8 రాష్ట్రాలు

ఆరవ దశ (57) : 25 మే : 7 రాష్ట్రాలు

ఏడవ దశ (57): 1 జూన్ : 8 రాష్ట్రాలు

ఎన్నికల కౌంటింగ్ : 4 జూన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 నియోజకవర్గాలకు 4వ దశలో అంటే మే 13న ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.

వీటితో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయెన్నికలు జరుగుతాయి.