News

సీఏఏపై 19న సుప్రీంలో విచారణ

346views

పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) దాఖలైన పిటిషన్లను ఈ నెల 19న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎమ్‌ఎల్‌) ఈ నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 195 పిటిషన్లు వచ్చాయి. మంగళవారం దీనిపై వాదనలు వింటాం. అన్నింటినీ కలిపి విచారిస్తాం’’ అని ధర్మాసనం తెలిపింది.