
విశ్వశ్రేయః కావ్యం” ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు :
జాతిని జాగృతం చేసి మునుముందుకు నడిపేది కవిత్వం అంటారు. ఆ కోవకు చెందినవి గతంలో పలువురు కదలాడుతుంటాయి. “సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్యభూమి” అని
శ్రీసత్యసాయి బాబావారు ప్రవచించినా, “భరత ఖండంబు చక్కని పాడి ఆవు అని చిలకమర్తివారు జన్మభూమికి ప్రణమిల్లినా, “దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్” అని మానవత్వాన్ని గురజాడ చాటిచెప్పినా, “ఏదేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవంబు” అని రాయప్రోలువారు కర్తవ్యబోధ చేస్తూ ఎలుగెత్తి చాటినా పైవన్నీ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షర తారకలు అని బసు గావించు అనటంలో అతిశయోక్తి లేదు. దేశ ఆత్మగౌరవాన్ని చాటే గేయాలు:
దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు, మరోవైపు తెలుగువారందరూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోరుతూ ఉద్యమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రోజులలో దేశభక్తి గీతాలు, రాష్ట్రాభిమానాన్ని ప్రబోధించే అనేక గీతాలు రచియించి ఆధునిక, ఆంధ్ర కవితా లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక విశేష స్థానాన్ని శ్రీ రాయప్రోలువారు పొందగలిగారంటే ఆయన యొక్క రచనా వైశిష్ట్యం ఎంత గొప్పదో అర్ధంచేసుకోవచ్చు శ్రీ రాయప్రోలువారు అసలు సిసలు జాతీయ కవి. అందుకే “ఏ దేశమేగినా కుడి ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మనవంటి పౌరులింకెందు” “మేలు కోవోయ్ భరతపుత్ర మేలు కోవోయ్ చిరచరిత్ర పిలుచుచున్నది వీరభారతి ఎలుగు వినబడనంతటన్” అంటూ గొంతెత్తి ఆత్మగౌరవాన్ని చాటుతూ తల్లి భారతాంబకు నివాళులు అర్పిస్తూ “భరతపుత్రుడనంచు భక్తితో పలకమని తెలుగు సాహితీ కళామతల్లి ముద్దు బిడ్డగా పిలుపునిచ్చిన సాహితీ ప్రవక్త శ్రీ రాయప్రోలు”.
సిరులు పొంగిన జీవగడ్డయు, పాలు పాతిన భాగ్య సీమయి వ్రాలినది. ఈ భరతఖండము, భక్తిపాడర తమ్ముడా!” “వేదశాఖలు పెరిగినిచ్చట, ఆది కావ్యం బలరే నిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదునుమ్మిది చెల్లెలా! ఈ విధంగా రాయప్రోలువారు అనేక గీతాలలో జాతీయ భావాన్ని ప్రబోధిస్తూ ప్రజలలో అనూహ్యమైన విధంగా ఉద్వేగపూరిత చైతన్యాన్ని రగిలించారు. ఆరోజులలో ఆంధ్రోద్యమ సమయంలో రాయప్రోలు వారి ఈ పద్యాలను శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు తన సహజ గంభీర ధోరణిలో పఠిస్తూ ఆనాటి సామాన్య చక్కని ప్రజలను సైతం చైతన్యపూరితులను గావించడం ఆంధ్రుల చరిత్రలో చిరస్మరణీయంగా చెప్పుకోదగిన అంశము.
శ్రీ రాయప్రోలువారు 1892వ సం॥ మార్చి 13వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర గల గార్లపాడు గ్రామంలో విద్వత్ కుటుంబంలో జన్మించారు. తన మేనమామ గారు అయిన మేనమామగారు అయిన శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి శిష్యత్వంలో సంస్కృతాంధ్ర భాషలలో తర్పీదు పొంది గురువుతో కలిసి అవధానాలు చేసే స్థాయికి చేరి సాహితీ శిఖరదర్శనం గావించుకున్న భాషాధ్యాయి శ్రీ రాయప్రోలు.
భాషాసేవలతోపాటు భరతజాతికి ఏకాత్మక సందేశం అందించిన జాతీయ కవిగా మన్ననలను అందుకున్న సాహితీమూర్తి శ్రీ రాయప్రోలు. వీరి రచనలు భావ కవిత్వానికి ప్రతీకలుగా నిలిచి సిద్ధాంత కావ్యాలుగా గణుతికెక్కాయి. అసలు ఆధునిక భావ కవితానంద నందనవనానికి తొలి తోటమాలి శ్రీ రాయప్రోలు అని సాహితీ రాయప్రోలు విజ్ఞులచే కీర్తింపబడటం విశేషం.
నెల్లూరులో జరిగిన ఆంధ్రస్వాతంత్ర్య మహాసభలలో శ్రీ రాయప్రోలు వారు రచన గావించిన “అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయము స్థాపించునాడు” అన్న పద్యాలను రాగయుక్తంగా ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఆలపిస్తుంటే నాటి సభ స్వాతంత్ర్యోద్యమ దీప్తితో నదీ ప్రవాహ ఝరిలా పొంగిపొరలిందని చెప్పవచ్చు. తెలుగువాణి, తెలుగు కత్తి, తెలుగు భూమి ఈ పలుకులతో తెలుగునాట జాతీయోద్యమ బాటలు వేసిన తెలుగు కలం, తెలుగుగళం శ్రీ రాయప్రోలుది. తెలుగు రాజు శౌర్యం, తెలుగు నదులు, తెలుగు సిరిసంపదలతో నాట్యమాడేదే ఆయన భాష, నాదేశం, నాజాతి, అన్న ఆత్మ గౌరవాన్ని ఆంధ్రులలో పెంచి పోషించిన కవి శ్రీ రాయప్రోలు. “తుంగభద్రా భంగములు పొంగినింగిని పొడిచి త్రుళ్ళి భంగపడిన తెనుంగునాథుల పాటపాడవే చెల్లెలా” అంటూ పిలుపునిచ్చారు. “చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర హృదయములు చీల్చి చదువుడో సదయులార”అని దేశాభిమానంతోపాటు ఆంధ్రాభిమానాన్ని చాటుకున్న ధీశాలి రాయప్రోలు.
నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, ఆంధ్ర -పండిత పరిషత్ కు అధ్యక్షునిగా రేడియో సలహా సమితి, ఫిల్మ్ సెన్సార్ బోర్డు, కేంద్ర రాష్ట్ర సాహిత అకాడమీ సలహా సంఘ సభ్యునిగా శ్రీ రాయప్రోలు చేసిన విశేష సాహితీ సేవలు మరువలేనివి. 1968లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భముగా డాక్టరేట్ ప్రదానం చేసి విశ్వవిద్యాలయం తనను తాను గౌరవించుకున్నదని చెప్పవచ్చు 1977 సంవత్సరం ఫిబ్రవరి 26న ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని ‘కళాప్రపూర్య బిరుదుతో సత్కరించింది. ఈ శతాబ్ది తెలుగు కవి పెద్దలలో మహాకవి శ్రీ రాయప్రోలు వారి రచనలు నేటి యువతకు, రచయితలకు స్ఫూర్తి, ఆదర్శం.
జాతీయకవిగా, భావకవితా నవ్యరీతులలో తీర్చిదిద్దిన హాలికునిగా పేరెన్నికగన్న శ్రీ రాయప్రోలువారు 1984 జూన్ 30వ తేదీన సికింద్రాబాదులో తమ కవికి వారసత్వాన్ని తెలుగునాట దిగవిడిచి అమృతలోక వాసులైనారు.





