
416views
కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే అధికారులు, పోలీసుల సూచనలు పాటించాలి. లక్షల్లో వచ్చే భక్తులు, వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది కొన్ని చేదు అనుభవాలతో ఈసారి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రవిశంకర్‌రడ్డి, డీఎస్పీ వర్మ ప్రకటించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా వాహనాల క్రమబద్ధీకరణతో పాటు, ఘాట్‌రోడ్డు మీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వెళ్లకుండా చూస్తామంటున్నారు. పైకి కార్లు, ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని, ఆర్టీసీ బస్సుల్లోనే పయనించాలని, ప్రముఖులకు ఏసీ బస్సులుంటాయని వెల్లడించారు.

ప్రభలు వెళ్లే దారులు
వాహనాల్లో వచ్చేవారు
తిరుగుపయనం




