Newsvideos

డా.హెడ్గేవార్ జన్మత: రాజీ పడని దేశభక్తులు : దత్తాత్రేయ హోసబాలే జీ

403views

డా.హెడ్గేవార్ జన్మత: రాజీ పడని దేశభక్తులు అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. నాగపూర్‌లో ఆయన జన్మించిన సమయంలో దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతోందన్నారు. నాగపూర్ ఎటువంటి ప్రదేశం అంటే, పలు విధాలుగా దేశ విముక్తి కోసం, స్వతంత్ర్య సంగ్రామం కోసం ఎందరో భూమిపుత్రులు నాగపూర్‌లో అందుబాటులో ఉన్నారని ఇటువంటి వాతావరణంలో డాక్టర్ జీ జన్మించారని డాక్టర్ జీ జన్మత: దేశభక్తులు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటే, ఆయనది ఆంగ్లేయులు పాలిస్తున్నారు కాబట్టి వ్యతిరేకతల మధ్య జనించిన దేశభక్తి కాదని ఆయన దేశభక్తి ఎటువంటిది అంటే, ఈ దేశంలో మనం జన్మించాం. ఇది మన నిర్ణయం. ఇది మన కర్తవ్యం అనే దేశభక్తి అని అన్నారు. అందుకే డా.హెడ్గేవార్ జన్మత: దేశభక్తులు, రాజీ పడని క్రియాశీల దేశభక్తుడని అన్నారు. అందుకే ఆయన మాటల్లో దేశభక్తి తొణికిసలాడుతుందని . ఆయన సహచర్యం పొందిన వారు దేశభక్తి స్ఫూర్తిని నింపుకునే వెళతారని తెలిపారు.