
414views
అత్యాధునిక ‘అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ’ క్షిపణిని భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి బుధ, గురువారాల్లో ఈ ప్రయోగ పరీక్షల్ని నిర్వహించి నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అధిక వేగంతో దూసుకెళ్తున్న మానవరహిత లక్ష్యాలను ఈ క్షిపణులు కచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది.





