
874views
నెల్లూరు జిల్లా కోట మండలం పామంజిపాళెం మత్స్యకార గ్రామంలో గతంలో హైందవ ధర్మాన్ని వీడి అన్య మతాన్ని స్వీకరించి ఉండిన ఒక మత్స్యకార కుటుంబం తిరిగి హైందవ ధర్మాన్ని స్వీకరించింది. గ్రామస్తులందరి సమక్షంలో స్థానిక దేవాలయంలో నెల్లూరు దత్త పీఠానికి చెందిన మాతాజీ అధ్వర్యంలో ఈ పునరాగమన కార్యక్రమం జరిగింది. పర ధర్మాన్ని వీడి స్వధర్మాన్ని స్వీకరించిన కుటుంబానికి సదా ఆ పరమేశ్వరుని కృప లభించాలని మాతాజీ ఆశీర్వదించారు. గ్రామస్థులందరూ ఆ కుటుంబాన్ని హిందూ ధర్మంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి నాయకులు శ్రీ కే. జయరాం, శ్రీ వాయల బాబు, శ్రీ కొండూరు చిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.





