News

తమిళనాడులో కొనసాగుతున్న NIA దాడులు

503views

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ రోజు తమిళనాడు రాష్ట్ర మధురై నివాసి మహ్మద్ షేక్ మైథీన్ నివాసంపై దాడి చేశారు.  మైథీన్ ను ఈ నెల 15 న “అన్సరుల్లా” సంస్థ కేసులో NIA అధికారులు అరెస్టు చేశారు.

భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంతో టెర్రరిస్టు దాడులు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న అతి వాద ఇస్లామిక్ సంస్థలతో ఇతనికి సంబంధాలున్నట్లుగా NIA భావిస్తోంది. ‘అన్సరుల్లా’ సంస్థకు ఐసిస్, అల్ ఖైదా, సిమిలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. నిందితులు భారత్ లో టెర్రరిస్టు దాడులు నిర్వహించేందుకు నిధుల సేకరణ చేస్తున్నట్లు NIA వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి.

మధురైలో మైథీన్ నివాసమున్న వీధి

టెర్రరిస్టు దాడులు నిర్వహించేందుకు, ప్రేలుడు పదార్థాలను, విషాన్ని, కత్తులను, వాహనాలను ఎలా ఉపయోగించాలో తెలియజేసే వీడియోలు, జీహాదీ సాహిత్య వ్యాప్తికి పని చేస్తున్నారు.

జూలై 13 న తీవ్రవాద నిరోధక సంస్థ హసన్ అలీ, హారీష్ మొహ్మద్, మొహ్మద్ ఇబ్రహీం, మీరన్ ఘని, రఫీ, అహ్మద్, ముంతాసిర్, ఉమర్ బరూక్, ఫరూక్ అనే 9 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోగా జూలై 15 న మొహ్మద్ షేక్ మైథీన్, అహ్మద్ అజారుద్దీన్, తౌఫిక్ అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ సిని, సాహుల్ హమీద్, ఫైజల్ షరీఫ్ అనే మరో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.