News

విశాఖపట్నంలో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు

520views

విశాఖపట్నం, షీలానగర్ స్కూల్లో జరుగుతున్న రెండు రోజుల భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ రాష్ట్ర మహాసభలు ఈ రోజు ఉదయం 9.30 ని లకు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి.

బీఎంఎస్ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభం కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీఎంఎస్ అఖిల భారతీయ అధ్యక్షులు, హిరణ్మయి పాండే మాట్లాడుతూ, భారతీయ మాజ్దూర్ సంఘ్, దేశంలో ఉన్నటువంటి 740 జిల్లాలకు గాను 570 జిల్లాలలో బీఎంఎస్ శాఖలు పని చేస్తున్నాయని, సుమారుగా 2 కోట్ల మంది సభ్యులతో దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందిందని అన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్, రాజకీయలకు అతీతంగా కేంద్రం లోను రాష్ట్రంలోను ఏ పార్టీ అధికారంలో ఉన్నపటికీ, కార్మిక పక్షాన ఉండి పని చేస్తుందని, బీఎంఎస్ ప్రయత్నం వలన దేశంలోని మొదటిసారి అందరికి సామాజిక భద్రత ఉండాలన్న ఉదేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, సామాజిక భద్రత చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదింప చేయడం వలన, దేశంలో ఉన్న 40 కోట్ల అసంఘటిత కార్మికులకు లభం చేకూరుతుందని తెలిపారు. బీఎంఎస్ ప్రయత్నం వలన హరియణాలోని EPS95 పెన్షనేర్స్ లకు, కనీస పెన్షన్ ను 3000 రూపాయిలగా నిర్దారించారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి గారి తో మాట్లాడి, దేశవ్యాప్తంగా ఉన్న వయో వృదులకు మరియు EPS 95 పెన్షన్ దారులకు 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశ మరియు GDS కార్యకర్తలను కార్మికులుగా గుర్తించాలని, తద్వారా అన్ని రకాల సామాజిక బాధ్యత చట్టాలును అమలు జరపాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రయత్నంతో, అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త కార్మిక ఫెడరేషన్ ప్రారంభమవుతుందన్నారు.అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగిందని , తద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ-శ్రమ్ కార్డ్ తో జోడింపబడుతున్నాయని తెలిపారు.

ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మన్నవ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా అఖిల భారత ఉపాధ్యక్షులు మళ్ల జగదేశ్వరరావు, దక్షిణ భారత సంఘటన మంత్రి దురై రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MVS నాయుడు మరియు రాష్ట్ర సెక్రటరీ లోవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సభలకు వచ్చిన ప్రతినిధులను విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు రొక్కం సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి సరగడం రామచంద్ర శేఖర్, రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్ లు ఆహ్వానం పలికారు.