
భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95) (Fali S Nariman) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘ఎక్స్ (X)’ వేదికగా స్పందించారు. అత్యుత్తమ న్యాయవాదులలో నారిమన్ ఒకరని మోదీ పేర్కొన్నారు. సామాన్య పౌరుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ‘‘అత్యుత్తమ న్యాయవాదులు, మేధావులలో ఒకరు.. ఫాలీ నారిమన్ . సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్ను కలిచివేసింది. ఆయన కుటుంబం, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు వాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని మోదీ తెలిపారు.
కాగా.. ఫాలి ఎస్ నారిమన్ (Fali S Nariman) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో ఆయన తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దీని తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.