News

రూ.84,560 కోట్ల ఆయుధ సమీకరణకు రక్షణ శాఖ నిర్ణయం

249views

భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టేలా భారీగా ఆయుధ సమీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ. 84,560 కోట్ల విలువైన సాధన సంపత్తి కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికింద..కొత్తతరం ట్యాంకు విధ్వంసక మందుపాతరలు, గగనతల రక్షణకు ఉద్దేశించిన కంట్రోల్ రాడార్, భారీ టోర్పిడోలు, మధ్యశ్రేణి సముద్ర నిఘా, బహుళ ప్రయోజన విమానం, విమానాలకు గగ నతలంలోనే ఇంధనం నింపే లోహ విహంగాలు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను సైనిక దళాల కోసం కొనుగోలు చేయనున్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా.. స్వదేశీసంస్థల నుంచే పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.