
286views
జాతీయ పతాక స్ఫూర్తిని చాటి చెప్పేలా జగ్గయ్యపేటలో 150 అడుగుల జెండా స్తూపాన్ని ఆవిష్కరించడం నవ్యాంధ్ర ప్రదేశ్ కు వన్నె తెచ్చేదిగా ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అన్నారు. జగ్గయ్యపేట పట్టణం విష్ణుప్రియనగర్ లో జాతీయ రహదారి పక్కనే తిరంగ్ పార్క్ ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాక స్తూపం, శిలాఫలక ఆవిష్కరణ కార్య క్రమానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. ఆ రెండింటిని ఆవిష్కరించిన గవర్నర్ అనంతరం మాట్లాడుతూ.. జాతీయ పతాకంలోని రంగుల భావాన్ని, అందులోని విశిష్టతను వివరించారు. కార్యక్రమానికి సారథ్యం వహించిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ జగ్గయ్యపేటలో జరిగిన స్వాతంత్రోద్యమ ఘట్టాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.





