
దట్టమైన అడవి.. 40 కి.మీ ప్రయాణం.. ఇలకైలాసం (శ్రీశైలం) నడుచుకుంటూ వెళ్లే మార్గం.. మార్చి 1 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనార్థం లక్షల మంది భక్తులు తరలొస్తారు. మండల దీక్ష చేపట్టిన శివస్వాములు, మొక్కుతీర్చుకోవాల్సిన వారు నడక మార్గంలో వెళ్తుంటారు. ఆత్మకూరు పట్టణం నుంచి వెంకటాపురం, నాగలూటి, దామెరకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పటికే కన్నడ భక్తుల రాక మొదలైంది. నడక మార్గంలో ఇప్పటి వరకు మంచినీటి బావులు శుభ్రం చేయలేదు.. చేతి పంపులు బాగు చేయలేదు. దారిలో రాళ్లకుప్పలు సరిచేయలేదు.
కాలు జారితే పాతాళానికే
నడక దారిలో ఎండు గడ్డి కోయడం ఇప్పుడే ప్రారంభించారు. మెట్లమార్గంలో ఉన్న బండలపై రాలిన ఆకులు తీయడం లేదు. నునుపైన బండలపై నిల్వ ఉన్న ఆకులపై అడుగేస్తే జారిపోయే ప్రయాదం ఉంది. నడక మొదలయ్యే వెంకటాపురం మార్గంలో ముళ్లపొదలు తొలగించలేదు. పెచ్చెర్వు నుంచి భీముని కొలను మార్గంలో కొండలు ఎక్కి దిగాల్సి ఉంది. కోర్కెల కొండ, కత్తుల కొండ, మఠం బావి సమీపంలోని కొండలపై బండరాళ్లు నునుపుగా ఉన్నాయి. మామూలుగానే బండలు జారుతున్నాయి. వాటిపై ఎండిన ఆకులు పడి ఉండటంతో పాదం వేస్తే కింద పడాల్సి వస్తోంది. భీముని కొలను వద్ద ఎత్తైన కొండ దిగి పెద్ద పెద్ద బండరాళ్లు దాటి వెళ్లాల్సి ఉంది. అటవీ అనుమతులు బూచి చూపి దేవస్థానం అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.

తోవ పొడవునా కోనీటికష్టాలు





