News

రేపటి నుంచి రథయాత్ర 58 రోజుల పాటు విజయవాడలో రథ యాత్ర

272views

లోకకల్యాణార్థం విజయవాడలోని సూర్యారావుపేటలోని శివజ్ఞాన పీఠంలో ఏప్రిల్ 26న శివ సూర్యుడు, కల్యాణ నవ గ్రహ విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందని పీఠం అధిపతి శివాచార్య స్వామి తెలిపారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికీ సూర్య దర్శనం, ప్రతి ఇంటా ఆరోగ్యం కార్యక్రమం ద్వారా నగరంలో 58 రోజుల పాటు రథ యాత్ర సాగుతుందని తెలిపారు. శివ జ్ఞాన పీఠంలో రథయాత్ర కర పత్రాలు ఆవిష్కరించారు. 11 నుంచి ఏప్రిల్ 8 వరకు 58 రోజుల పాటు జరిగే రథయాత్రలో నవగ్రహవ్రతాలు ఉచితంగా నిర్వహిస్తామని వివరిం చారు. ఆసక్తి ఉన్న భక్తులు సూర్యారావుపేట గోపరాజు రామచంద్రరావు వీధిలోని శివజ్ఞాన పీఠంలో సంప్రదించాలని కోరారు.