
387views
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అర్చకులు ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ద్వాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకం చేసి బంగారు, నవరత్న కవచాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు ఇచ్చారు. భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠంలో ఉదయమే అన్న ప్రసాద పంపిణీని ప్రారంభించారు.




