
421views
విజయవాడలోని బావాజీపేట ఐదోలైన్లో బావాజీ మఠానికి చెందిన దేవాదాయశాఖకు చెందిన ఖరీదైన 200 చదరపు గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చర్చిని నిర్మించడంపై గతంలో వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అప్పటివరకు ఈ విషయాన్ని దేవదాయశాఖాధికారులు గుర్తించలేదు. స్థలాన్ని అక్రమించి చర్చిని నిర్మించడంపై దేవదాయ అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించారు. అనంతరం చర్చి నిర్మాణం చేసిన వారికి నోటీసులు ఇస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. చర్చి నిర్వాహకులు నోటీసులు తీసుకోవడం లేదు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో దేవదాయశాఖాధికారులు చర్యలు శూన్యంగా ఉండడంతో నిర్వాహకులకు మరింత ఊతం ఇచ్చినట్లయింది.





