
221views
ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి చరిత్ర గ్రంథం తొలి ముద్రణకు ఆలయంలో శనివారం అధికారులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ శ్రీవరసిద్ధి వినాయక వైభవం, ఉపాసన విధానం గ్రంథం పూర్తి స్థాయిలో ముద్రించినట్లు తెలిపారు. ఈ గ్రంథం ద్వారా స్వామి భక్తులకు ఆలయ చరిత్ర తెలుస్తుందన్నారు. ఈ గ్రంథాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.





