
419views
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని యాత్ర ప్రముఖ్ మహంత్ ఉబ్బేటి నాగేశ్వరరావు అ న్నారు. విజయనగరం కేంద్రీయ విశ్వ విద్యాలయం, ‘ఆంధ్రప్రదేశ్ వనవాసీ ఆశ్రమ్ సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర’ పేరిట జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని చింతలపూడి పంచాయతీ సమ్మెదలో సమావేశం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ దొమ్మంగి బోడెమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి పునరుద్ధరణ తదితర అంశాలపై యాత్ర ప్రముఖ్ నాగేశ్వరరా వు వివరించారు. మాజీ ఎంపీటీసీ బి. సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.





