
తిరుమలలో ఈనెల 16న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు అసౌకర్యం కల గకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఈవో’ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. “శ్రీ మలయప్పస్వామి ఆరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
* ఎస్ఎస్ఈ టోకెన్లు, ఆర్జిత సేవల రద్దు
రథసప్తమిని పురస్కరించుకుని ఈనెల 15, 16, 17 తేదీల్లో ఎస్ఎస్ఈ టోకెన్లు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మూడు రోజుల్లో ప్రత్యేక దర్శనాలు ఉండవని తెలిపారు. ఈనెల 14న తెల్లవారుజామున 12 గంటల నుంచి 16న అర్ధరాత్రి 12 గంటల వరకూ టీబీ, ఎంబీసీ-34 కౌంటర్లు మూసేసి సీఆర్వో, శ్రీపద్మావతి విశ్రాంతి భవ నాల సముదాయంలో మాత్రమే గదుల కేటాయింపు చేస్తారని వివరించారు.





