News

దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

240views

బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదికి రావాల్సిన నిధులను ఉత్తర భారతానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం నుంచి తగినన్ని నిధులు అందడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. దీంతో డీకే సురేష్ వ్యాఖ్యలపై వివాదం రేగింది.

కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందిచారు. కాంగ్రెస్ పార్టీకి విభజించు, పాలించు చరిత్ర ఉందని.. అదే ట్రిక్ ఇప్పుడు సురేష్ ప్లే చేస్తున్నారన్నారు. విభజించి పాలించాలన్న కాంగ్రెస్ ఆలోచన.. వలసవాదులు అనుసరించిన దానికంటే ఘోరంగా ఉందని ట్వీట్ చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఓ ఎంపీ ఇలా మాట్లాడటం కాంగ్రెస్ విభజన ఆలోచనను తెలియజేస్తోందని అన్నారు