
339views
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చినజీయర్ స్వామి అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో నిర్వహిస్తున్న సుదర్శన యాగంలో బుధవారం ఆయన పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో భాగంగా విష్ణు సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన, తీర్థ గోష్ఠి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు. చేసే మంచిని ప్రతి ఒక్కరికి చెప్పాలని రాముడు, శ్రీకృష్ణుడు, రామానుజాచార్యులు ఉపదేశించారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన 150 మంది భక్తులు సమాశ్రయణ దీక్ష స్వీకరించారు.





