
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల సమీప గ్రామమైన అయ్యలూరు గ్రామంలో 50 మంది విద్యార్థులతో నడుస్తున్న అభ్యాసిక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ నెల 28న ఘనంగా నిర్వహించారు.
నంద్యాల బస్తీలు మరియూ పరిసర గ్రామాల్లో 20 అభ్యాసికలు గత సంవత్సర కాలంగా నిర్వహిస్తున్నారు.

అభ్యాసిక వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్యప్రదర్శనలు, పిరమిడ్లు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ పాఠశాల వార్షికోత్సవానికి తీసి పోని విధంగా జరిగాయి.

హాజరైన సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, విభాగ్ ప్రచారక్ గారు నిర్వాహకురాలి కృషిని, సహకరించిన గ్రామం పెద్దలు మహేశ్వరరెడ్డి గారిని అభినందించారు. ఈ అభ్యాసిక మిగతా పంతొమ్మిది అభ్యాసిక లకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ సురేంద్ర బాబు, సంఘమిత్ర అధ్యక్షులు కె. నాగసుబ్బారెడ్డి, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్వర్లు, డి శ్రీనివాస్ పాండే, సంఘటన కార్యదర్శి శ్రీమతి విజయశ్రీ , విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ విశ్రాంత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లింగేశ్వర రావు, స్టానికులు ఎ. మహేశ్వరరెడ్డి , వెంకట కృష్ణ , సేవా ప్రముఖ్ శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు కుమారి కె.లావణ్య, విద్యార్థులు తల్లి దండ్రులు పాల్గొన్నారు.





