
కడప ఎమ్మార్వో కార్యాలయం వెనుకవైపు ఉన్న దేవి దేవతల విగ్రహాలు, రేకుల షెడ్డు తొలగించడం దారుణమని బీజేపీ కడప కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి వెంకటసుబ్బారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, నాయకులు పవన్ కుమార్ లు అన్నారు.
సోమవారం కడప తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న దేవాలయాన్ని బిజెపి నాయకులు, హిందూ సంఘాలు పరిశీలించారు. అనంతరం 7 రోడ్స్ సర్కిల్లో ఆందులోన చేపట్టారు. తిరిగి ఆ విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని నినాదాలు చేశారు. ఎమ్మార్వో ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఎలాంటి వ్యతిరేక పనులు ప్రభుత్వ అధికారులు చేయకూడదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు జరగబోయే ధర్నా కార్యక్రమంలో అన్ని హిందూ సంఘాలు పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ బట్టర్ , సీనియర్ న్యాయవాది భారవి, బిజెపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, లక్ష్మణరావు, రంగ ప్రసాద్, ప్రభు, నాగిరెడ్డి,పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





